calender_icon.png 24 February, 2026 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా!

24-02-2026 12:40:17 AM

  1. కాలేజీ ఆస్తుల విషయంలో నా తప్పు ఉంటే దేనికైనా సిద్ధం
  2. రాజకీయ లబ్ధి కోసమే కళాశాల ఆస్తుల నాటకం
  3. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
  4. కాటిపల్లిని అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: ఎంపీ డీకే అరుణ

కామారెడ్డి, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): రాజకీయ లబ్ధి కోసమే కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశాన్ని తెరపైకి తె చ్చారని, ఆ ఆస్తుల విషయంలో తన తప్పు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు. కలెక్టరేట్‌లో సో మవారం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రెవెన్యూ అధికారులను కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో నిజాలు బయట పెట్టాలని వినతిపత్రం అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో తాను, తన తండ్రి ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నదన్నారు. ప్రభు త్వంలో ఉన్న కాంగ్రెస్.. రెండు నిమిషాల్లో పత్రాలు తెచ్చి, నిజాలు తేల్చేయవచ్చునని.. అలాంటప్పుడు ఈ గొడవ ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

2004 నుంచి 2009 వరకు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ నాడు ఏమి చేయలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన సీఎం ద్వారా రికార్డులు తెప్పించుకోవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాల ని కోరారు. దీనికి కచ్చితంగా ముగింపు పలుకుతానని తెలిపారు. ‘263 ఎకరాల్లో భూమి లో 1964 నుంచి ఇప్పటివరకు ఏ భవనానికి ఎంత స్థలం కేటాయించారు ప్రజా ప్ర యోజనాల కోసం చేసారా స్వార్థ ప్రయోజనాల కోసం చేసారా అనేది నిగ్గు తేల్చాలని కలెక్టర్‌ను కోరాను’ అని ఎమ్మెల్యే తెలిపారు.

తన తప్పు జరిగిందని తెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెంకటరమణారెడ్డి అన్నారు. 8.20 ఎకరాల కళాశాల మైదానం దున్నిన వారి వెనకాల ఉన్నది ఎవరని నిలదీశారు. తెర వెనుక రాజకీయ శక్తులు లేకపో తే ఇతర ప్రాంతాల వారు కళాశాల భూమిపై కన్ను ఎలా వేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఆరుగురు బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని తనను శాంతి భద్రతల సమస్య వస్తుందని ఇంట్లోనే ఉంచారని కాంగ్రెస్ వాళ్లను మాత్రం ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. రేపటి నుంచి కాంగ్రెస్ వాళ్లకు ప్రాణభయం ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు. 

ప్రొటోకాల్‌ను విస్మరిస్తున్నారు: డీకే అరుణ

షబ్బీర్ అలీ ప్రొటోకాల్ పాటించకుండా మంత్రులను తెచ్చి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయించడం ఏమిటని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డితో కలిసి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో పోటీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. కామారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కళాశాల ఆస్తుల వ్యవహారాన్ని రాద్ధాంతం చేయడం తగదన్నారు. దమ్ముంటే సాక్షాలు చూపి అవినీతిని బట్టబయలు చేయాలన్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డి కి ఎలాంటి హాని జరిగిన బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు.  

భయంతో పారిపోయిన ఎమ్మెల్యే: కాంగ్రెస్

ఆధారాలతో రండి.. కలెక్టర్ ముందే తేల్చుకుందాం.. అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా‘ అంటూ ప్రగల్భాలు పలికిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, తీరా సమయం వచ్చేసరికి చర్చకు భయపడి పారిపోయారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్‌కుమార్  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కలెక్టరేట్ వేదికగా జరిగిన హైడ్రామా ఎమ్మెల్యే అసలు రంగును బయటపెట్టిందని ఆయన విమర్శించారు.

‘మేము ఆధారాలతో కలెక్టర్  వద్దకు వెళ్తే, ఆయన ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే చర్చ కోసం తన వద్ద ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని, కేవలం ఒక వినతిపత్రం ఇచ్చి వెళ్ళిపోయారని కలెక్టర్ స్పష్టం చేశారు‘ అని తెలిపారు. ఆర్టీఐ సమాచారానికి 40 రోజుల గడువు ఉంటుందని, ఆ లోపు ప్రజల దృష్టి మళ్ళించి తప్పించుకోవచ్చని ఎమ్మెల్యే ప్లాన్ చేస్తున్నారని ఆరో పించారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టా తమ వద్ద సిద్ధంగా ఉందని, ఆయ న రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమని సందీప్ హెచ్చరించారు.