కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ
12-05-2026 10:45 AM
బెజ్జూర్, మే 12 (విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీజీ గురుకుల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణాలకు సోమవారం బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతిలు భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం టీజీ డబ్ల్యూ ఐ డి సి కింద కస్తూరిబా అదనపు గదుల నిర్మాణాలకు రూ 18 లక్షల15 వేలు మంజూరు చేసింది. ఇట్టి పనులను భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీ ఓ శ్రీనివాస్, ఎంఈఓ సునీత, కస్తూర్బా ప్రత్యేక అధికారి అరుణ, ఇంజనీర్ గిరీష్ కుమార్, గ్రామ కార్యదర్శి మీసారి వైకుంఠం,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






