పార్టీకి తెచ్చే పనిచేయను
- నా మీద కుట్రలు పన్నుతున్నరు
- భయపడటానికి ఫామ్‌హౌస్‌లో ఎలుకను కాను
- రాజకీయంగా ఎదుర్కోలేకనే దుష్ప్రచారం
- కేంద్రం ఇచ్చిన నిధులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది
- కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): పార్టీకి తెచ్చే పని తాను ఏనాడూ చేయబోనని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనను నమ్మాలని, తాను ఏతప్పూ చేయలేదని, దుష్ప్రచారానిన నమ్మొద్దని కోరారు. భయపె టడితే భయపడటానికి తాను ఫామ్ హౌ స్‌లో ఎలుకను కాదన్నారు. దేశం, ధర్మం కోసం ఎందాకైనా కొట్లాడాలనే ఆర్‌ఎస్‌ఎస్ ఉగ్గుపాలతో పెరిగినోళ్లమని, తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదన్నారు.
‘అయ్య ఆస్తి మీద.. అయ్య పేరు మీద ఎదిగిన నాయకుణ్ణి కాదు. బీజేపీ సైనికులం, మోదీ శిష్యులం’ అన్నారు. అక్రమాలు, అరాచకాలు చేస్తూ తెలంగాణను ముంచినోళ్లే ఎదురుదాడి చేస్తుంటే ఏ తప్పు చేయనోళ్లం ఊరు కోమన్నారు. ‘అగ్గి పుట్టిద్దాం ఆ అగ్గిలో అవినీతి, కుటుంబ పార్టీలను కాల్చి బూడిద చేద్దాం’ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బరిగీసి నిలబడతా,కలబడతానన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్ భావోద్వేగాని కి లోనై కీలక వ్యాఖ్యలు చేశారు.
జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? అని కాంగ్రెస్ నేతలు హేళనగా మాట్లాడుతున్నారని, జై శ్రీరాం అంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. బెంగాల్ గెలుపుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల్లో వ ణుకు మొదలైందన్నారు. ఢిల్లీ నుంచి మోదీ నిధులు తెస్తుంటే కాంగ్రెసోళ్లు తెలంగాణ సొమ్మును ఢిల్లీకి పంపుతున్నారని విమర్శించారు. హిం దీ మాట్లాడే మోదీ నిధుల వరద పారిస్తుంటే తెలుగు మాట్లాడే రేవంత్‌రెడ్డి నిధులు ఢిల్లీకి దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
మోదీ రూ.12 లక్షల కోట్లు ఇస్తే రేవంత్‌రెడ్డి తెలంగాణకు చిప్ప చేతికిచ్చారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తల పోరా టాల వల్లే గడీలు బద్దలయ్యాయని, తమ కార్యకర్తల బలిదానాలను, త్యాగాలను వృథా గా పోనివ్వబోమని చెప్పారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ధాన్యం కొనుగోలు చే యకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు.






