calender_icon.png 10 February, 2026 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామ్‌నగర్‌ను అభివృద్ధి చేసి చూపిస్తా

10-02-2026 12:45:18 AM

శ్రీరామ్ నగర్  ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు హామీ 

మంథని ఫిబ్రవరి 09 (విజయక్రాంతి) శ్రీరామ్ నగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చుపిస్తానని సోమవారం శ్రీరామ్ నగర్  ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు హామీ ఇచ్చారు. 5వ వార్డులోని కూచిరాజుపల్లి గంగాపురి శ్రీరామ్ నగర్ లో మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

విద్యావేత్త,  సౌమ్యుడైన సీనియర్ వకిలి సాబ్  ముసుకుల సహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మీ వార్డును అభివృద్ధి చేసుకోవాలని శ్రీధర్ బాబు మహిళలను ప్రజలను కోరారు. 

శ్రీధర్ బాబు వెంట మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ట తిరుపతి యాదవ్, మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న,  కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి సర్వేష్ గౌడ్, నక్క శంకర్,  మారుతి, పర్శవేణి మోహన్, తోకల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.