పేపర్ లీక్ చేస్తే.. పదేళ్ల జైలు శిక్ష.. 10 కోట్ల జరిమానా
- పేపర్ లీక్ చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
- 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1 కోటి జరిమానా
- మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పేపర్ లీకులపై కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీపై కఠిన శిక్షలు విధించే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి జేపీ నడ్డా(Union Minister JP Nadda) ప్రకటించారు. పేపర్ లీక్(paper leak) కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేపర్ లీక్ చేస్తే పదేళ్లు జైలుశిక్ష, 10 కోట్ల జరిమానా విధించనున్నారు. కాక్‌రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party) చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని నడ్డా తెలిపారు. చర్చల్లో ఆందోళనకారులు ఇచ్చిన సూచనలు తీసుకున్నామని పేర్కొన్నారు. కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచారని వివరించారు. రేపు మద్యాహ్నం తర్వాత మరోసారి చర్చలు ఉంటాయని వెల్లడించారు. రేపటి చర్చల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నీట్ సహా విద్యావ్యవస్థలో కీలక అంశాలపై సీజేపీతో చర్చించినట్లు నడ్డా వెల్లడించారు.
'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) ప్రతినిధులతో సమావేశమైన అనంతరం కేంద్ర మంత్రి జె.పి. నడ్డా ఇలా అన్నారు: "ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు జరిగింది. పరీక్షలకు సంబంధించి వారికి 3 ప్రధాన డిమాండ్లు, 5 సంస్కరణ ప్రతిపాదనలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం వారిని మళ్లీ కలుస్తామని, ప్రభుత్వ స్థాయిలో జరిగిన చర్చల వివరాలను వారికి తెలియజేస్తామని మేము వారికి చెప్పాము." అని మీడియాతో తెలిపారు.






