24 July, 2026 | 4:25 PM

కేటీపీపీలో టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో 28వ రోజు నిరసన

24-07-2026 04:01 PM

గణపురం,(విజయ క్రాంతి): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఏహెచ్‌పీ, సీఎహెచ్‌పీ విభాగాల ప్రైవేటీకరణ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కెటిపిపిలో కార్యక్రమం టీజీపీఈజేఏసీ  ఆధ్వర్యంలో 28వ రోజు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లాంట్ ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణ చర్యలు ఉద్యోగుల భవిష్యత్తును, సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

వైటిపిఎస్ ఏహెచ్‌పీ, సీఎహెచ్‌పీ ప్రైవేటీకరణ టెండర్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగుల ఆందోళనలను గౌరవించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టెండర్ రద్దు అయ్యే వరకు టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ నిరసనలో టీజీపీఏ, టీఎస్‌ఈఏఈఏ, 1104, 327, 1535, కెమిస్ట్ అసోసియేషన్, డిప్లొమా అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.