24 July, 2026 | 4:25 PM

పోలీసులు అప్రమత్తతతో పనిచేయాలి

24-07-2026 04:04 PM

జిల్లా ఎస్పీ జానకి

కోయిల్ కొండ: పోలీసులు ఎల్లప్పుడూ అపరిమిత ఉంది ప్రజలకు రక్షణ కవచం వారి సంక్షేమం కోసం పనిచేయాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. శుక్రవారం మండల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల వివరాలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని చట్టబద్ధంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగరాజు తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.