24 July, 2026 | 4:54 PM

అధిక ధరలకు ఎరువుల విక్రయిస్తే కఠిన చర్యలు

24-07-2026 03:53 PM

– జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్

ఆసిఫాబాద్(విజయక్రాంతి): రైతులకు ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయించే ఫెర్టిలైజర్ దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ హెచ్చరించారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయంలో ఫర్టిలైజర్ దుకాణ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎరువులు, పురుగుమందులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని సూచించారు.

నిషేధిత పురుగుమందులైన మోనోక్రోటోఫాస్ ,ప్యారాక్వాట్ విక్రయించరాదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు దుకాణాలను తనిఖీ చేస్తారని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల నుంచి ఫిర్యాదులు అందితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో ఎడీఏ మిలింద్ కుమార్, ఏఈఓలు, ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు పాల్గొన్నారు.