22 July, 2026 | 1:16 AM

మెగా ఫ్యామిలీలో ఉండేందుకు అర్హురాలినని గర్వంగా చెప్పుకోగలను!

21-07-2026 01:10 AM

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో రెండు అవార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిహారిక కొణిదెల మాట్లా డుతూ.. “నేను ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీయాలని ‘కమిటీ కుర్రోళ్లు’ని నిర్మించలేదు.

జాతీయ అవార్డు రావాలని కోరుకున్నా. నా కల నేడు నెరవేరింది. చిరంజీవి అందరికీ గర్వకారణం అని నేను ఫీల్ అవుతుంటాను. ఆయనే నన్ను గర్వకారణం అన్నారు. నేను మెగా ఫ్యామిలీలో ఉండేందుకు అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను” అని తెలిపారు. దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్లు’ నేషనల్ అవార్డ్ కొడుతుందని ముందు నుంచీ అందరికీ చెప్తూనే వచ్చా.

ఒక్క రూపాయి బిజినెస్ కాకపోయినా ధైర్యంతో నిహారిక అడుగు ముందుకు వేశారు. అలా ప్రారంభమైన ప్రయాణాన్ని ఆమె ఇప్పుడు జాతీయస్థాయిలో నిలబెట్టారు” అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఫణి అడపాక, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేశ్, మేకప్ మెన్ రవికుమార్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.