22 July, 2026 | 1:40 AM

పర్యాటక రంగంలో మెదక్ జిల్లా ఖ్యాతి జాతీయ స్థాయికి ఎదగాలి

22-07-2026 01:13 AM

జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  సీనియర్ కన్సల్టెంట్స్ శవంతి గుప్తా, భువన్ ల బృందం గత ఐదు రోజులుగా కొనసాగిన పలు పర్యాటక ప్రదేశాల సందర్శన ముగింపు 

మెదక్ జులై 21(విజయ క్రాంతి) :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, మంత్రి జూపల్లి కృష్ణారావు. సూచనలు సలహాలు,తెలంగాణ టూరిజం (పర్యాటక మరి యు సాంస్కృతిక) శాఖ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శి  ఎ. వాణీ ప్రసాద్, గారి ప్రత్యేక చొ రవ , మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు , మైనంపల్లి రోహిత్ రావు , ప్రత్యేక దృష్టితో ప్రజా ప్రతినిధులు సహకరించిన తీరు మరువలేనిదని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అ న్నారు.

మెదక్ జిల్లాలోని పర్యాటక  సుందర ప్రకృతి రమణీయ  వాతావరణానికి ప్రసిద్ధి చెందిన పోచారం అభయారణ్యంలో జిల్లా పర్యాటక శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంప్ ఫైర్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందని తెలిపారు. మెదక్ జిల్లాలోని పర్యాటక, చారిత్రాత్మక వారసత్వ ఆ ధ్యాత్మిక  అభయారణ్యాలతో ఒక స ర్క్యూట్ రూపొందిస్తున్నట్టు తెలిపారు.

రా ష్ట్రంలో పర్యాటక రంగ పర్యాటకశాఖ జి ల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలని ఉద్దే శంతో జిల్లాలో ఉన్న చారిత్రాత్మక ఆధ్యాత్మిక వారసత్వ కట్టడాలతో పాటుగా మెదక్ కు తల మాణికమైన పోచారం అభయారణ్యం ప్రాంతాలను అభివృద్ధిపరిచి పర్యాటక రంగంలో మెదక్ జిల్లాకు విశేష గుర్తింపులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీసుకురావడానికి కృషి ప్రయత్నంలో భాగంగా గత ఐదు రోజులుగా జిల్లాలోని అనేక ప్రాం తాలను జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  సీనియర్ కన్సల్టెంట్స్  శవంతి గుప్తా, భువన్ ల బృందం,

బారాకమాన్ మెట్ల బాయి ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆల యం టేక్మాల్ తుంబరేశ్వరాలయం, వెల్దుర్తి కళాతోరణం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పా ర్క్ , పెద్ద శంకరంపేట పాపన్నపేట వెంకట్రావుపేట చెన్నంపేట గ్రామాలలో కోటలు, చిన్న శంకరంపేట లో జిల్లాకు ప్రత్యేక గుర్తిం పు తెచ్చిన ముత్యాల కు రంద్రాలు పెట్టే వా టిని, పర్యాటక ప్రదేశాల సందర్శన ముగిం పు దశకు చేరుకున్నట్లు తెలిపారు. డీఎఫ్‌ఓ జోజి, జిల్లా పర్యాటక శాఖ అధికారి రమేష్ గంగాల, హవేలీ ఘనపూర్ తాహసిల్దార్ సిం ధు రేణుక , ఈడియం సందీప్,

అధికారులు పాల్గొని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. క్యాంప్ ఫైర్ చుట్టూ సమావేశమైన అ ధికారులు జిల్లాలో పర్యాటక రంగ అభివృ ద్ధి, పోచారం అభయారణ్యాన్ని మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిది ద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై పరస్పరం చర్చించారు.ప్రకృతి ఒడిలో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరికీ ఆహ్లాదాన్ని పంచడం తో పాటు పరస్పర సమన్వయాన్ని పెంపొందించేందుకు దోహదపడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోచారం అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి అడవుల పరిశుభ్రతను కాపాడాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, అటవీ శాఖ అధికారులు, పర్యాటక శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నా రు. పోచారం అభయారణ్యంలో క్యాంప్ ఫైర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా  సింగ్, డి ఎఫ్ ఓ జోజి, జిల్లా పర్యాటక శాఖ అధికారి రమేష్ గంగాల, హవేలీఘన్పూర్ తాహసిల్దార్ సింధు రేణుక, డిపిఆర్‌ఓ రామచంద్ర రాజు.