22 July, 2026 | 2:01 AM

పంచాయతీల్లో కార్యదర్శులు ఎక్కడ?

22-07-2026 01:14 AM
  1. అలా వస్తున్నారు.. ఇలా వెళ్తున్నారు..
  2. ఎస్‌ఐఆర్ కీలక సమయంలోనూ నిర్లక్ష్యం?

కొండాపూర్, జూలై 21 కొండాపూర్ మండల పరిధిలోని 24 గ్రామపంచాయతీల్లో సగానికి పైగా పంచాయతీలలో కార్య దర్శులు నిర్ణీత కార్యాలయ సమయాలను పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం కార్యాలయానికి సమ యానికి హాజరు కాకుండా కొందరు ఉద యం 10:30 నుంచి 11:30 గంటల మధ్య గ్రామాలకు వచ్చి, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోనే వెళ్లిపోతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్  ఓటరు నమోదు ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న సమయంలోనూ కొందరు పంచాయతీ కార్యదర్శులు పూర్తి సమయం గ్రామాల్లో అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హాజరు నమోదుకు, ఫోటోలు దిగడానికి మాత్రమే కార్యాలయానికి వస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీల్లో ప్రజలు ధృవపత్రాలు, పన్నులు, ఇతర పరిపాలనా పనుల కోసం కార్యాలయాలకు వెళ్లినప్పుడు, ‘మండలంలో మీటింగ్ ఉంది‘, ‘కలెక్టరేట్లో సమావేశం ఉం ది‘, ‘బ్యాంకుకు వెళ్లాం‘ వంటి కారణాలు చెబుతూ పనులు వాయిదా వేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అధికారులు చర్యలు తీసుకోవాలి..

ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే మండలంలో కొందరు కార్యద ర్శులు సెలవులకు వెళ్లి ఇప్పటికీ విధుల్లో చేరలేదని సమాచారం. దీంతో ఓటరు నమోదు పనులు ప్రభావితమవుతున్నాయని స్థానికులు అంటున్నారు.ఈ అంశంపై పై అధికా రులకు ఫిర్యాదు చేస్తే, ‘ఎవరైనా సమయానికి రాకపోతే ఫోటోలు తీసి పంపండి... పరిశీలించి చర్యలు తీసుకుంటాం‘ అని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన సందర్భాలు కనిపించడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పం చాయతీ కార్యదర్శులు నిర్ణీత సమయాల్లో కార్యాలయాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని, ఎస్‌ఐఆర్ వంటి కీలక కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా ఉన్నతాధికా రులు గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.