పార్కును కాపాడిన హైడ్రా
ఆక్రమణలకు గురికాకుండా కంచె ఏర్పాటు
మేడిపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాలనీవాసుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలోని అధికారులు పార్క్ స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలు తొలగించి, పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని, చుట్టు కంచే ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా పార్కు చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా టెలిఫోన్ కాలనీ వాసులు పార్క్ స్థలాన్ని పరిరక్షించినందుకు హైడ్రా అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైడ్రా సీఐ రాజశేఖర్, మేడిపల్లి ఎస్‌ఐ తిరుపతి, డీఆర్‌ఎఫ్ టీం సభ్యులు, మేనేజర్లు జైపాల్ రెడ్డి, చంటి, అలాగే టీం సభ్యులు నాగరాజు, పవన్, రామ్ కుమార్, గణేష్, శ్రీకాంత్, శివలింగం, సందీప్, కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రమేష్ గౌడ్, వీరారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






