8 March, 2026 | 4:58 AM

99 రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారాలి

08-03-2026 12:00 AM
  1. పారిశుద్ధ్యం, చెరువుల క్లీనింగ్, పార్కుల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ 
  2. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ప్రియాంక అలా  

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 7(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ నగరం లో రాబోయే 99 రోజుల్లో స్పష్టమైన మా ర్పు విజిబుల్ చేంజ్ కనిపించాలని, ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ను అధికారులు ఒక సవాలుగా తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రెవెన్యూ, హెల్త్ ప్రియాంక అలా ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాల మేరకు శనివారం  జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్‌నుఆమె ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాల అధిపతులు, డిప్యూటీ కమిషనర్లు ఇం జనీరింగ్ అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు.నగరంలో మార్పు అనేది కేవలం ఒక్క విభాగంతో సాధ్యం కాదని, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానిం గ్ వంటి అన్ని విభాగాలు సమన్వయంతో, ఒక జట్టుగా పనిచేయాలని ప్రియాంక అల సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం మెరుగుదల, పార్కుల సుందరీకరణ, చెరువుల శుభ్రత, రోడ్ల క్లీనింగ్, జంక్షన్ల అభివృద్ధి రోడ్డు భద్రతా చర్యల్లో 99 రోజుల తర్వాత నగరం కొత్తగా కనిపించాలని స్పష్టం చేశారు.

నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు కనిపించకూడదని, ప్రభుత్వ కార్యాలయాలు పార్కులు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. 99 రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమం ముగిసే వరకు అత్యవసరమైతే తప్ప అధికారులకు, సిబ్బందికి సెలవులు మంజూ రు చేయబోమని ఆమె తేల్చి చెప్పారు.

స్వ యం సహాయక సంఘాల బలోపేతం, ఆస్తి పన్ను వసూళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు మందా మకరం దు, సత్యనారాయణ, రవి కిరణ్, చంద్రకళ, జోనల్ కమిషనర్లు ముకుంద రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మంగతాయారు చీఫ్ ఇంజనీర్ జ్యోతి ర్మయి తదితరులు పాల్గొన్నారు.