మనిషి ప్రాణం చాల విలువైనది
ఇసుక లారీ వేగంగా వచ్చి మరో లారీని డీ కొట్టింది
వేగం ప్రమాదకరం: పస్రా ఎస్ఐ తాజుద్దీన్
ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని(Govindaraopet Mandal) పస్రా పోలీసుస్టేషన్ పరిధిలో కోటగడ్డ క్రాస్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఇసుక లారీని మరో ఇసుక లారీ వేగంగా వెనక నుండి వచ్చి డీ కొట్టింది. ఇసుక లారీ ఢీకొనడంతో వెనక లారీ క్యాబిన్ నుజ్జు నుజ్జు ఆయ్యింది డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ రాజేష్ లారీ క్యాబిన్ లో ఇరుక్కోవడం జరిగింది వెంటనే పస్రా పోలీసులు సమాచారం అందుకున్నారు.
పస్రా ఎస్సై తాజుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకొని క్యాబిన్లో ఇరుక్కుని ఉన్న డ్రైవర్ రాజేష్ కాలు నుజ్జు నుజ్జు అయ్యి విలవిల లాడుతుంటే ఎస్సై తాజుద్దీన్ మానవత్వంతో ప్రాణాలు కాపాడాలని వెంటనే జేసీబీని తెప్పించి ఆ జేసీబీ సహాయంతో రాజేష్ ని బయటికి తీసి వెంటనే అంబులెన్స్ లో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు.విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న పస్రా ఎస్సై తాజుద్దీన్ కి మండల ప్రజలు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రొఫెషనరీ సెకండ్ ఎస్సైలు ఆంజనేయులు,సతీష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




