20-02-2026 10:50:31 AM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా(Sangareddy) అమీన్ పూర్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 2.7 కిలోల నల్లమందును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు(Madhapur SOT Police) పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే పక్క సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు అమీన్‌పూర్‌లోని ఓ మార్బుల్ షాపుపై దాడులు నిర్వహించారు. డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాజస్థాన్ నుంచి నల్లమందును హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ. లక్ష నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని కఠినమైన ఆంక్షలు విధించిన రాష్ట్రంలో ఎక్కడో అక్కడ రోజూ మత్తు పదార్థాలు పట్టుబుడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు. అందుకు మత్తు పదార్థాల విషయంలో కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.