10 March, 2026 | 11:38 AM

హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం

09-03-2026 12:54 AM

మహబూబాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్. పీ. వీ) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ పీ వీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహిళల్లో గర్భాశయ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించుకోవచ్చన్నారు.

ముఖ్యంగా యువతులు, బాలికలు ఈ వ్యాక్సిన్ను తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రజలు ఈ వ్యాక్స్పి ఉన్న అపోహలను తొలగించి ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీవీవీపీ కోఆర్డినేటర్ డాక్టర్ చింత రమేష్, ఆర్‌ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ, పెడియాట్రిక్  డాక్టర్ మోహన్ యూపీహెచ్సీ వైద్య అధికారి డాక్టర్ మౌనిక, ఎంపీహెచ్‌ఈఓ కేఎల్‌ఎన్ స్వామి, తోట శ్రీనివాస్, గోపు రవి, అరుణ్, ప్రసాద్, రాజు పాల్గొన్నారు.