21 April, 2026 | 3:10 AM

భిక్కనూర్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభం

21-04-2026 12:22 AM

భిక్కనూర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భిక్కనూర్లో 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న క్వాడ్రివాలెంట్ హెచ్పీవీ టీకా ఉచితంగా అందించే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.

జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ ఆదేశాల మేరకు సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ చేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యురాలు డాక్టర్ యేమిమా మాట్లాడుతూ అర్హులైన బాలికలు ఈ టీకాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.