13 March, 2026 | 5:30 PM

బాలికలకు హెచ్‌పీవీవ్యాక్సిన్‌ తప్పనిసరి

13-03-2026 03:13 PM

వైద్యాధికారి డాక్టర్ ఎం. శివకుమార్

నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని గట్లమల్యాల హైస్కూల్లో ,విద్యార్థినులు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయులకు క్యాన్సర్, హెచ్ పి వి వ్యాక్సినేషన్‌(HPV vaccine ) పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గట్లమల్యాల వైద్యాధికారి డాక్టర్ ఎం. శివకుమార్ మాట్లాడుతూ..14 ఏళ్లు నిండి, 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా హెచ్ పి వి వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అర్హులైన బాలికలకు నంగునూరు సిహెచ్సీ లో ఏర్పాటు చేసిన సెషన్‌లో టీకాలు ఇప్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ కనకయ్య, ఎఎన్ఎం లావణ్య, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.