22 May, 2026 | 1:11 PM

కవిత అరెస్ట్

22-05-2026 12:12 PM

హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం(Telangana Secretariat) వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సచివాలయం వద్ద ధర్నాకు దిగారు. తక్షణమే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. ధాన్యంలో తరుగు తీయవద్దంటూ సెక్రటేరియట్ ముందు బైఠాయించారు.

రైతులకు వెంటనే న్యాయం చేయాలంటూ కవిత ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కవితను అరెస్ట్(Kavitha Arrested) చేశారు. ధర్నా చేస్తున్న కవితను పోలీసులు పోలీస్ స్టేషన్ కు  తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను వ్యాన్‌లో, కవితని కారులో తరలించారు.