మల్లుపల్లిలో ఇందిరమ్మ నూతన గృహప్రవేశం
19-08-2026 08:44 PM
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం మల్లుపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన నూతన గృహంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ గృహ పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరేంద్రరెడ్డి, గ్రామ సర్పంచ్ నారాయణ, నాయకులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






