10 August, 2026 | 3:09 AM

అర్హులైన గిరిజనులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

10-08-2026 01:52 AM

గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు ఎం.గోపి నాయక్ 

ఎల్బీనగర్ , ఆగస్టు 9 : తెలంగాణ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ నగర్ లౄ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రపంచ ఆదివాసి గిరిజన హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా నాయకుడు గోపి నాయక్ మాట్లాడుతూ..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులతో,  గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలపై కుట్ర పూరిత విధానం అవలంభిస్తున్నారని ఆరోపించారు.  అటవీ సంపధను విదేశీ పెట్టుబడిదారీ సంస్థలకు అప్ప చెప్పి గిరిజనులను అడవి నుంచి దూరం చేసే విధానాన్ని అవలంభిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి అటవీ సంపదను కార్పొరేటర్ సంస్థలకు ఇచ్చి, అడవి నుంచి ఆదివాసి,

గిరిజనులను బలవంతంగా తరిమి వేస్తున్నారన్నారు. కొంతమంది నాయకులు గిరిజనులు, దళితుల హక్కులను కాలరాసే విధంగా రిజర్వేషన్లను తొలగించాలన్న వాదనను తెరపైకి తీసుకోస్తున్నారని ఆరోపించారు.  స్వతంత్ర భారతదేశంలో ఆదివాసి, గిరిజనులు విద్య, వైద్యం, ఉద్యోగం, రాజకీయ రంగాలకు  దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. అర్హులైన గిరిజనులకు సొంత గృహాలు లేక మురికి వాడల్లో నివసిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రామావత్ పాండునాయక్, మోహన్ నాయక్, శంకర్ నాయక్, గోపాల్ నాయక్, కేతావత్ అవుజా నాయక్, అమర్ సింగ్ నాయక్, చందర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.