calender_icon.png 8 February, 2026 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుబాటులో ఉండి సేవ చేసే వారిని ఆదరించండి

08-02-2026 12:59:06 PM

ప్రచారంలో దూసుకుపోతున్న జిలాని బేగం

పాల్వంచ (విజయక్రాంతి): ఓట్ల సందర్భంగా మాయమాటలు చెప్పి, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తూ ఓట్లు దండుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉండి సేవ చేసే వారిని ఆదరించాలని తెలుగుదేశం బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి జిలాని బేగం అన్నారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని 46వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ మస్తాన్ సతీమణి జిలాని బేగం ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రతి ఓటర్ ను కలిసి సిపిఐ తోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని అమూల్యమైన ఓటు కంకి కొడవలి గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు. తన భర్త డాక్టర్ మస్తాన్ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారని, భర్తను ఆదర్శంగా తీసుకొని తాను ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాజకీయంలోకి వచ్చాను అని తెలిపారు.