08-02-2026 01:46:15 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంథని పట్టణ ప్రజల్లో రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు. ఆదివారం మంథని పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 2వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోగుల రవి తో పాటు ఎడ్ల సాగర్, బుక్క సాయి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ మంథన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతు తో 13 వార్డులకు 13 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అన్నారు. ఉదయం నుండి శ్రీను బాబు అన్ని వార్డులలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు.