హనుమాన్ జయంతి సందర్భంగా పులిహార, మజ్జిగ పంపిణీ
12-05-2026 05:53 PM
జనసేన పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు సేవా కార్యక్రమం
ఇల్లందు,(విజయక్రాంతి): హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఇల్లందు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే మార్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు పులిహార, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రహదారిపై ప్రయాణించే ప్రజలు, భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రజలకు స్వయంగా పులిహార, మజ్జిగ అందజేశారు.






