బండి సంజయ్ కుమారుని వెంటనే అరెస్టు చేయాలి
నిర్మల్,(విజయక్రాంతి): ఓ మైనర్ బాలికలు హింసించిన కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ నువెంటనే అరెస్ట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కేసు నమోదు అయి రోజులు గడుస్తున్న విచారణ పేరుతో కేసులు పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పలుతుందని ఆరోపించారు.
సామాన్యులు ఇటువంటి ఘటనకు పాల్పడితే కేసులు పెట్టి హింసించే పోలీసులు పెద్దలకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక తీసుకుని కేసును త్వరగా చేదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ వినోద్ సాదిక్ తదితరులు ఉన్నారు






