12 May, 2026 | 6:56 PM

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

12-05-2026 06:13 PM

పెద్దేముల్ పీఎస్ లో జిల్లా ఎస్పీ ఆకస్మిక సనిఖీ

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ ప్రాంతం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్నందున, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పెద్దెముల్ పోలీసులతో జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర అన్నారు.  మంగళవారం ఆమె పోలీస్ స్టేషన్ ను సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణను, పరిసరాలను పరిశీలించారు. ఎస్‌హెచ్‌ఓ  గది, రిసెప్షన్ సెంటర్, రైటర్స్ రూమ్, లాకప్ గదులతో పాటు మహిళా, పురుషుల బ్యారక్‌లను, వాష్‌రూమ్‌లను తనిఖీ చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో రిసెప్షన్ అధికారులు ప్రవర్తించే తీరును అడిగి  తెలుసుకున్నారు.

పెండింగ్‌లో ఉన్న రికార్డులను, ఫైళ్లను స్వయంగా తనిఖీ చేసి  ఎస్సై ప్రశాంత్ వర్ధన్ కు పలు సూచనలు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా ను, బక్రీద్ సందర్బంగా కర్ణాటక సరిహద్దుల నుండి అక్రమ పశువుల రవాణా  లను అరికట్టేందుకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని. రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి. డయల్ 100 ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను  అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.