31 August, 2026 | 4:55 AM

ఇంటి అద్దెల బాదుడు..

31-08-2026 01:47 AM
  1. ‘గ్రేటర్’లో సామాన్యుల విలవిల 
  2. నడ్డి విరుస్తున్న రెంట్లు
  3. మెట్రో రూట్లు.. ఎడ్యుకేషన్ హబ్‌లో మరింత ప్రియం 

రంగారెడ్డి, ఆగస్టు 30 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో నివాసం ఉండటం సగటు మధ్యతరగతి కుటుంబానికి తీవ్ర భారంగా మారుతోంది. ఐటీ కారిడార్ పరిధిలో ఇళ్ల అద్దెలు గడిచిన కొంతకాలంలోనే 40 శాతానికి పైగా పెరిగిపోవడంతో ఉద్యోగులు, సామాన్యులు విలవిల్లాడుతున్నారు. నెలకు రూ.50,000 జీతం వస్తున్నప్పటికీ, అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు పోను బతుకు బండిని లాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ప్రాంతాల వారీగా సరాసరి నెలవారీ అద్దెలు...

సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ల అద్దెలను పరిశీలిస్తే.. దిల్‌సుఖ్‌నగర్ రూ. 10వేల నుంచి రూ.20 వేలు.. ఇక్కడ వి ద్యాసంస్థలు, కోచింగ్ సెంట ర్లు ఎక్కువగా ఉండటం.. కూకట్పల్లి రూ.18వేల నుంచి రూ.35వేలు ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండ టం, మెట్రో కనెక్టివిటీ.. కొండాపూర్ రూ.24 వేల నుంచి రూ.50వేలు. ఐటీ కారిడార్ సామీప్యత, గేటెడ్ కమ్యూనిటీల డిమాండ్.. హైటెక్ సిటీ రూ.30వేల నుంచి రూ.65వే లు.. ఇక్కడ ఐటీ హబ్, వాకింగ్ డిస్టెన్స్ ఆఫీసులు, లగ్జరీ ఫ్లాట్లు

మెట్రో రూట్లు.. ఎడ్యుకేషన్ హబ్‌లలో మరింత మంట..

సిటీ ప్రధాన ఏరియాలో దిల్ సుఖ్ ఖ్నగర్  మియాపూర్ (రెడ్ లైన్), నాగోల్  రాయదుర్గం (బ్లూ లైన్) మార్గాల్లో ఉన్న కాలనీల్లో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఆఫీసులు, కళాశాలలకు వెళ్లవచ్చనే ఉద్దేశంతో మెట్రో స్టేషన్ల సమీపంలోని ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.   

అమీర్పేట్, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, బాచుపల్లి వంటి విద్యార్థుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఓ చిన్న గది లేదా సింగిల్ బెడ్ రూమ్ దొరకడమే గగనమవుతోంది. మెజారిటీ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనలను తప్పనిసరి చేయడంతో ఉద్యోగులందరూ ఒకేసారి నగరం వైపు రావడం రెంట్లు పెరగడానికి ప్రధాన కారణమైంది.

జోరుగా సబ్ లీజింగ్ & పీజీలు..

బ్యాచిలర్లు మరియు యువ ఉద్యోగులు అద్దె భారాన్ని తట్టుకోలేక షేరింగ్ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఐటీ రంగం అభివృద్ధితో పాటు అద్దె నిబంధనలపై స్పష్టమైన నియంత్రణ లేకపోవడంతో యజమానులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని అద్దెదారులు కోరుతున్నారు.