26 April, 2026 | 11:16 AM

ఎర్రవల్లి సమీపంలో ఘోర ప్రమాదం

26-04-2026 09:57 AM

- లారీని ఢీకొట్టిన వోల్వో బస్సు

- 5 మందికీ గాయాలు.. 

- హైవే అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ఎర్రవల్లి: తిరుపతి నుండి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్సు ఆదివారం ప్రమాదానికి గురైంది. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కోదండపురం స్టేజి సమీపంలో లారీని వెనుక నుండి బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులలో ఐదుగురు  గాయపడ్డారు.

గాయపడిన వారిని సాయిశ్రీజ(27), అంజలి(20), చిన్నారులు ఫయిజా, హైజా తాఫిన్, అని గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, హైవే 44 అంబులెన్స్ ద్వారా బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.