7 July, 2026 | 7:49 PM

Breaking News

జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •  

ట్రంప్ మీటింగ్ లో కాల్పుల ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ

26-04-2026 11:06 AM

న్యూఢిల్లీ: హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ విందులో జరిగిన కాల్పుల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ క్షేమంగా ఉండటం పట్ల ఆయన ఊరట చెందారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని, హింసను నిస్పందేహంగా ఖండించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

శనివారం రాత్రి ఒక వ్యక్తి భద్రతా సిబ్బందిపై షాట్‌గన్‌తో కాల్పులు జరపడంతో, ట్రంప్, మెలానియా ట్రంప్‌లను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు విందు నుంచి బయటకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆయుధాలు ధరించిన వ్యక్తి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై కాల్పులు జరిపాడని ఎఫ్‌బిఐ అధికారి రాయిటర్స్‌కు వెల్లడించారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ వల్ల ఆ అధికారి ప్రాణాలతో బయటపడ్డారని, ఆయన పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.