26 April, 2026 | 12:45 PM

అమెరికాలో కాల్పులు, ట్రంప్ కు తప్పిన ముప్పు

26-04-2026 11:01 AM

వాషింగ్టన్: వాషింగ్టన్‌లో జరిగిన  వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు కలకలం రేపింది. శ్వేతసౌధం సమీపంలో ఓ దుండగుడు కాల్పులు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా కీలక నేతలకు ముప్పు తప్పింది. కల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తనతో పాటు ప్రథమ మహిళ, అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, క్యాబినెట్ సభ్యులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్(Truth Social)లో  పోస్టు చేశారు.

కాల్పులు జరిపిన వ్యక్తి పట్టుబడ్డాడని ట్రంప్ చెప్పారు. భద్రతా సిబ్బంది అద్భుతంగా పని చేశారని, ధైర్యంగా స్పందించారన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని, నాతో సహా మోలానియా, జేడీ వ్యాన్, కేబినెట్ సభ్యులందరూ క్షేమమని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.30 రోజుల్లోపు డిన్నర్ మీట్ ను రీషెడ్యూల్ చేస్తామని, కాల్పులు జరిపిన నిందితుడి వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. దుండగుడి కాల్పుల్లో భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని వెల్లడించారు.

గాయాలైన భద్రతా అధికారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, నాపై దాడికి యత్నించడం ఇదే తొలిసారి కాదని, గతంలో పెన్సిల్వేనియాలోనూ నాపై దాడికి యత్నించారని ట్రంప్ తెలియజేశారు. శక్తిమంతమైన వ్యక్తులపై దాడులు జరుగుతూనే ఉంటాయని, కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి కాల్పులు జరిపాడని, కాల్పుల ఘటన పూర్తిగా ఊహించని పరిణామమని డొనాల్డ్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.