15 May, 2026 | 6:52 PM

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ

15-05-2026 05:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ సప్లమెంటరీ కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి పరశురాం నాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లాలో మొత్తం 24 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 21 29 విద్యార్థులకు గాను 20 14 విద్యార్థులు పరీక్ష రాసినట్టు తెలిపారు. మధ్యాహ్నం 593 విద్యార్థులకు గాను 565 విద్యార్థులు పరీక్ష రాసినట్టు వివరించారు. నిర్మల్ మామడ లక్ష్మణ్ చందా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు