15 May, 2026 | 6:38 PM

భోజ్‌శాల ఆలయ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

15-05-2026 05:07 PM

భోపాల్: భోజ్‌శాల ఆలయ కేసులో(Bhojshala Temple Case) మధ్యప్రదేశ్ హైకోర్టు(Madhya Pradesh High Court) కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఇందౌర్ ద్విసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దశాబ్దాలుగా భోజ్ శాఖ ఆలయ వివాదం కొనసాగుతోంది.

ఆలయ స్థలం మసీదుకు చెందిందని ముస్లి వర్గాలు వాదించాయి. స్థల వివాదంపై ఇరువర్గాలు మధ్య ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాయి. 2024లో 98 రోజులపాటు పురావస్తు శాఖ సర్వే నిర్వహించింది. 2024 జులై 15న పురావస్తుశాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది.