14 July, 2026 | 4:42 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి గౌరవ వీడ్కోలు

30-04-2026 11:18 AM

హైదరాబాద్: పోలీస్ అకాడమీలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి(Telangana DGP Shivadhar Reddy) గౌరవ వీడ్కోలు లభించింది. పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్స్ లో శివధర్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ పోలీస్ శాఖకు నాయకత్వం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. అత్యంత ప్రగతిశీలమైన, సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ పోలీస్ శాఖను అగ్రగామిగా నిలిపామన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా పనిచేసే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శివధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నూతన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand), పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాస్ బిస్త్(Police Academy Director Abhilash Bisht) పాల్గొన్నారు. పదవీవిరమణ పొందిన శివధర్ రెడ్డికి సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. శివధర్ రెడ్డి(Shivadhar Reddy) 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పనిచేశారని ఆయన తెలిపారు. పోలీస్ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని వెల్లడించారు. ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేశారని చెప్పారు. ప్రజలకు పోలీస్ శాఖపై మంచి సందేశం వచ్చే విధంగా ఉండాలని సీవీ ఆనంద్ సూచించారు.