13 March, 2026 | 9:13 PM

తేనెటీగల దాడి... 15 మందికి గాయాలు

13-03-2026 04:46 PM

సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా గ్రామంపై దాడి చేశాయి. ఈ తేనెటీగల దాడిలో 15 మంది వరకు గాయపడారు, తేనెటీగల దాడిలో స్కూల్ పిల్లలు స్కూల్లో పనిచేసే అటెండర్ రోడ్డుపై బైక్ పైన వెళ్తున్న వ్యక్తికి తీవ్రంగా గాయపరిచాయి. తేనెటీగల దాడిలో గాయపడ్డ వారిని అంబులెన్స్ లో మరికొంతమందిని ఆటోలలో  సదాశివపేట గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్ కి తరలించారు.