తంగళ్లపల్లిలో కవిత జన్మదిన వేడుకలు ఘనంగా
13-03-2026 04:41 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా జాగృతి కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాగృతి నాయకురాలు చెరుకుపల్లి శైలజ, కలికోట దేవేంద్రతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవిత సమాజ సేవలో ముందుండి మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు.




