calender_icon.png 12 January, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్..

02-01-2025 12:00:00 AM

ప్రోటీన్ పౌడర్ అనేది కండరాల నిర్మాణానికి, బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మార్కెట్‌లో లభించే ప్రోటీన్ పౌడర్‌ల ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా వాటిలో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు, చక్కెర వంటి పదార్థాలను కలుపుతారు. ఇవేమీ లేకుండా ఇంట్లోనే సహజమైన ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

స్టేప్-1: నో ఫ్యాట్ మిల్క్ పౌడర్ మూడు కప్పులు, డ్రై ఓట్స్ ఒక కప్పు, బాదం ఒక కప్పు, కొద్దిగా బెల్లం, పావు కప్పు కోకోవా పౌడర్. వీటన్నింటినీ కలిపి మిక్సీలో పొడి చేసి గాలి చొరని డబ్బాలో పెట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. ఇది ప్రతిరోజూ వాడితే ఎంతో మంచిది. ఒక అర కప్పు ప్రోటీన్ పౌడర్‌లో 180 క్యాలరీలూ, 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ పౌడర్‌ని పాలలో కలిపి తాగవచ్చు లేదా స్మూతీల్లో, షేక్స్‌లో కూడా కలిపి తీసుకోవచ్చు. 

స్టేప్-2: బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, పల్లీలు, సోయా బీన్స్, గుమ్మడి గింజలూ, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఓట్స్, పాల పొడి.. అన్నీ పావు కప్పు చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిల్క్ పౌడర్‌తో కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఆ పొడిని జల్లిస్తే మెత్తని పౌడర్ తయారు అవుతుంది. దీంట్లో కోకోవా పౌడర్ కూడా కలుపుకోవచ్చు. జల్లెడలో మిగిలిన దాన్ని పారెయ్యక్కరలేదు. ఏ పాయసం లోనో, హల్వాలోనో కలిపేయొచ్చు. ఒక చెంచా పౌడర్‌లో 11 గ్రాముల ప్రోటీన్, 45 క్యాలరీలు ఉంటాయి.