ఛార్జీల పెంపు ఎఫెక్ట్
న్యూఢిల్లీ, జనవరి 1 : మొబైల్ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో టెలికాం కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో అదాయాన్ని పెంచుకున్నాయి. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో ఆపరేటర్ల స్థూల ఆదా యం 10 శాతం వృద్ధిచెంది రూ. 91,426 కోట్లకు చేరినట్లు ట్రాయ్ నివేదిక వెల్లడించింది.
2024 జూలై నెలలో ఎయిర్‌టెల్, జియో, వోడాఫో న్ ఐడియాలు మొబైల్ సర్వీసు ఛార్జీలను 11-25 శాతం మేర పెంచా యి. దీనితో ఆ కంపెనీలకు ఒక్కో యూజర్ నుంచి సమకూరే సగటు ఆదాయం (ఏపీఆర్‌యూ) పెరిగింది. ఏపీఆర్‌యూ 9.60 శాతం వృద్ధితో రూ.172.57కు పెరిగింది.
జూన్ త్రైమాసికంలో ఇది రూ.157.45. ఛార్జీల పెంపు ప్రభావంతో సెప్టెంబర్ త్రైమాసికం లో టెలికాం కంపెనీలు 1.68 కోట్ల మొబైల్ చందాదారుల్ని కోల్పోయాయి. జూన్ త్రైమాసికంలో మొబై ల్ చందాదారులు 117 కోట్లు కాగా, వీరి సంఖ్య సెప్టెంబర్ క్వార్టర్‌లో 115.37 కోట్లకు తగ్గింది.