రాజేంద్రనగర్‌లో 4న హిందూ సమ్మేళనం
11-03-2026 12:59 AM
ముషీరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ హరిహర క్షేత్రం మై దానంలో ఏప్రిల్ 4న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం తెలిపారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షుడిగా పెండ్యాల రామకృష్ణ, కార్యానిర్వహక అధ్యక్షుడిగా బాలరాజు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి డా. అమరేందర్, కోశాధికారిగా చిన్మయలు నియమితులైనట్లు హిందూ సమ్మేళనం ప్రచార కమిటీ వేముల రామకృష్ణ వెల్లడించారు. 4న జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటుపై మాజీ సర్పంచ్ పెండ్యాల పాండు హర్షం వ్యక్తం చేశారు.




