హిందూ సమ్మేళన కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా హిందూ సంఘటనకై చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా చుక్కలదేవ్ పల్లి (సుల్తానాబాద్) లో నిర్వహించు శ్రీ రాజరాజేశ్వర స్వామి హిందూ సమ్మేళన ఉత్సవానికి సంబంధించి నిర్వహణ సమితి ఆధ్వర్యంలో కరపత్రాలు మరియు పోస్టర్లను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దావులూరి మురళీధర్ జీ (విభాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్), మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో ఈనెల 18న హిందూ సంఘటనకై చేపట్టు ఈ ఉత్సవంలో హిందువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరని కోరారు. ఆశీర్వాద ప్రసంగానికై చిలుకూరు బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు రామదాసి సురేష్ ఆత్మరామ్ మహారాజ్, కొండగట్టు గిరిప్రదక్షిణ వ్యవస్థాపకులు పాల్గొంటారని తెలిపారు.




