18 August, 2026 | 12:29 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

గాంధీనగర్‌లో 23న హిందూ సమ్మేళనం

21-05-2026 12:15 AM

బీజేపీ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ 

ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్‌లోని ఆంధ్రాకేఫ్ చౌరస్తా వద్ద హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు ‘హిందూ సమ్మేళనం‘ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ సికింద్రాబాద్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్‌లోని హిందు బంధువులకు స్వాగతం పలుకుతూ బుధవారం కార్యక్రమ పోస్టర్‌ను శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి యువకులు, హిందూ సంఘాల నాయకులు, దేవాలయాల కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హిందూ ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రామకృష్ణ శాస్త్రి, వెంకటరమణ, డాక్టర్ చంద్రశేఖర్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వీ నవీన్ కుమార్, ఆనంద్ రావు, సోమిషెట్టి శ్రీనివాస్, రాధాకృష్ణ, సత్యనారాయణ, శకుంతల, శశికళ తదితరులు పాల్గొన్నారు.