15 May, 2026 | 5:00 PM

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

15-05-2026 03:48 PM

మాజీ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): భారత ప్రధాని మోడీ  ప్రజలకు పొదుపు మంత్రం వల్లిస్తూనే మరో పక్క ప్రజల పై భారం మోపే విధంగా పెట్రోల్. డీజిల్ పై లీటరు 3రూ పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా పెట్రోలియం కంపెనీ లు ఎన్నడైనా రెట్లు పెంచనయా అని ప్రశ్నించారు. పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసరవస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి పై భారం పడే అవకాశం ఉందని అన్నారు.

అలాగే పెట్రోల్ డీజిల్ పై ఆధార పడి న ఉత్పత్తి అయ్యే వస్తువులు ధరలతో పాటు. రవాణా రంగం పూర్తిగా ప్రజల పై భారం మోపే అవకాశం ఉందని అన్నారు. పరోక్షంగా. ప్రత్యక్షంగా. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే పరిస్థితి తెచ్చిందని ఎద్దేవ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పై భారం పడకుండా ధరలు తగ్గించాలి. ఆ నష్ట నివారణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అన్నారు. ఏది ఏమైనా పేద ప్రజల కోసం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.