15 May, 2026 | 5:21 PM

మానసిక వికలాంగులకు పండ్లు, జ్యూస్ పంపిణీ

15-05-2026 04:07 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్ కు చెందిన కృష్ణ సాయి మెడికల్ స్టోర్ ప్రొప్రైటర్ బొడ్ల శ్రీనివాస్  పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మానసిక వికలాంగుల కేంద్రంలో చిన్నారులకు ఫ్రూట్స్, జ్యూస్ పంపిణీ చేయడం జరిగినది. అలాగే సుద్దాల గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు అల్లాడి వెంగళరావు ఆటో కిరాయి నిమిత్తం ప్రతినెల ఇచ్చే విధంగా రూ.500 అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ , సెంటర్ ఇన్చార్జి శ్రీనివాస్, సరస్వతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.