15 May, 2026 | 5:18 PM

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం నియంత్రించాలి

15-05-2026 04:10 PM

హనుమకొండలో సీపీఐ వినూత్న నిరసన

హనుమకొండ,(విజయక్రాంతి): పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని కాళోజి సెంటర్ లో ఆటోలను తాళ్లతో లాగుతూ సిపిఐ నేతలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పెరిగిందన్నారు.

పెట్రో ధరల పెంపుతో రవాణా, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పది రోజుల క్రితం వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ ధరలను భారీగా పెంచి కనికరం లేకుండా సామాన్య ప్రజలపై  బిజెపి ప్రభుత్వం భారం మోపిందన్నారు. కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదన్నారు. గడిచిన 12 ఏళ్లుగా ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో పాలకులు ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలని పిలుపునిచ్చారు. పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలను వెంటనే తగ్గించని ఎడల ప్రజా గ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, బి.విజయసారధి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఎన్ ఎ స్టాలిన్, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, ఎదునూరి వెంకట్రాజం, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, మాలోత్ శంకర్ నాయక్, కండె నర్సయ్య, గుంటీ రాజేందర్, అలువాల రాజు తదితర వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.