15 May, 2026 | 5:33 PM

బోధన్ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి

15-05-2026 04:26 PM

- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం

బోధన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నామినేటెడ్ పోస్టులను రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాస్వామిక చర్యను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజరి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు పాల్గొన్నారు.