15 May, 2026 | 4:59 PM

పంట మార్పిడితో లాభాలు

15-05-2026 03:50 PM

వాంకిడి,(విజయక్రాంతి): పంట మార్పిడితో అధిక దిగుబడులు వస్తాయని ప్రొఫెసర్ డాక్టర్ అనిల్, రాజశేఖర్ లు అన్నారు. రైతు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వాంకిడి మండలం కోమటి గూడ గ్రామంలో ఏర్పాటుచేసిన రైతు అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి ఏటా ఒకే పంట సాగు చేయడంతో పొలాల్లో పంటలకు అవసరమైన పోషకాలు లభ్యం కావడం లేదన్నారు. రైతులు పునాస సీజన్లో సాగుచేసిన పత్తి, మొక్కజొన్న పంటలను పొలంలోనే కలియదున్నాలని సూచించారు. దీంతో కట్టెలు, ఆకులు కుళ్లిపోయి పొలం సారావంతమవుతోందన్నారు. అదేవిధంగా యాసంగి సీజన్ లో ఆరుతడి పంటలు వేసు కుంటే లాభాలు పొందవచ్చు అన్నారు. గ్రామ సర్పంచ్ మోతీరామ్, ఏఈ ఓలు శంకర్, అరవింద్, పంచాయతీ కార్యదర్శి సుజాత, ఉన్నారు.