టవరెక్కిన ప్రేమికులు
03-07-2026 12:00 AM
- ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ప్రేమ ప్రపోజ్
- అరెస్టు చేసిన పోలీసులు
న్యూయార్క్, జూలై 2: నగరంలో ఓ ప్రేమజంట అతిపెద్ద ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ 443 మీటర్ల ఎత్తులో ఉన్న టవర్‌పైకి ఎక్కారు. అక్కడ ప్రేమికుడు ప్రేమికురాలితో తన ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రపోజ్ చేశాడు. ఆమెకు ఉంగరం తొడిగాడు, టవర్‌పై నుంచి కిందకు దిగే ముందు ముద్దు పెట్టుకున్నాడు.
ఇవాన్, ఏంజెలా నికోలవ్ అనే ఇద్దరు ప్రేమికులు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎక్కి పది నిమిషాలు అక్కడే ఉన్నారు. నల్లని దుస్తులు ధరించిన వీరిద్దరూ ఒక బ్యానర్‌ను ప్రదర్శించారు. దానిపై ‘అధికార దాహాన్ని ప్రేమకున్న శక్తి అధిగమించినప్పుడు ప్రపంచంలో శాం తి విలసిల్లుతుంది’ అని రాసి ఉంది. భవనంపై నుంచి కిందకు వచ్చిన వీరిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు.






