సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి
సదాశివనగర్,(విజయక్రాంతి): రైతులు సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చునని వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని పద్మావతి వాడి క్లస్టర్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక లో భాగంగా రైతు వారోత్సవం కార్యక్రన్ని రైతు వేదిక కార్యాలయంలో నిర్వహించారు.
నేల ఆరోగ్య పరిరక్షణ సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం, నాణ్యమైన విత్తనాల వినియోగం,పంట రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహనా కల్పించారు.శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయన్ని ప్రోత్సహించాలని, రైతులు ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలిభించి వ్యవసాయం ద్వరా అధికా దిగుబడి పొందాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతిలో పై సూచనలు సలహాలను అందించారు. కార్యక్రమంలో పద్మాజివాడి, మూడేగాం, తుక్కోజీవాడి, తిమ్మాజివాడి, మల్లుపేట్ రైతులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.






