4 May, 2026 | 1:43 PM

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం

04-05-2026 12:18 PM

ఇల్లందు టౌన్, మే 4 (విజయక్రాంతి): పట్టణంలోని 22వ వార్డులో కోర్ట్ ఏరియా మార్గదర్శిని పాఠశాల ఎదురు నుండి మాజీ కౌన్సిలర్ ఆకుల అంజలి ఇంటి వరకు ఉన్న పాత, చిన్న డ్రైనేజీ వల్ల నెలలుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యను కౌన్సిలర్ కొర్లపాటి శివ కిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యను వెంటనే గుర్తించిన ఆయన ప్రత్యేక నిధుల ద్వారా రూ.2.20 లక్షల వ్యయంతో 130 మీటర్ల పొడవున నూతన డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ కొర్లపాటి శివ కిరణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్రకు వార్డు సమస్యలను తెలియజేయగానే స్పందించి పనులకు సహకరించినందుకు స్థానిక ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. డ్రైనేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత నీటి నిల్వలు, దుర్వాసన సమస్యలు పూర్తిగా తొలగి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. స్థానికులు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.