23 April, 2026 | 6:32 PM

పాలకోయతండా లోనే ఉన్నత పాఠశాలను నిర్వహించాలి

23-04-2026 05:28 PM

పాల్వంచ, (విజయక్రాంతి: కొత్తగూడెం కార్పోరేషన్ లోని పాల్వంచ పాలకోయతండా 31 డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా అభివృద్ధి చేయాలని సమగ్ర అభివృద్ధి వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రాథమిక పాఠశాల లో పేరెంట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ...  ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు 6, 7, 8, 9, 10 తరగతి లకు సుదూర ప్రాంతంలోని పాత పాల్వంచకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని, విపరీతమైన రద్దితో కూడిన నేషనల్ హైవే మీద ప్రయాణం  ప్రాణాలకే ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు సైతం సుధీర ప్రాంతాలకి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.  ఉన్నతాధికారుల ఈ సమస్యపై దృష్టి సారించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాలకోయ్య తండా ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాల గా అభివృద్ధి చేయటానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పేరెంట్ కమిటీ అధ్యక్షులు N.మేరీ కుమారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.