23 April, 2026 | 6:57 PM

మేదోశక్తితో విద్యను నేర్చుకోవాలి....

23-04-2026 05:29 PM

ఇంచార్జ్ జోనల్ అధికారి గిరిజ

సుల్తానాబాద్,(విజయక్రాంతి):  ప్రతి విద్యార్థి మేధా శక్తితో విద్యను నేర్చుకోవాలని కాలేశ్వరం జోనల్ వన్ ఇన్చార్జి అధికారి చెంచు గిరిజ అన్నారు. గురువారం ఆమె పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం  గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను సందర్శించి సెలవు పై వెళ్తున్న విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సెలవు పై వెళ్తున్న విద్యార్థులు నిత్యం సెల్ ఫోన్ లు, టీవీలు చూసి సమయం వృధా చేసుకోకుండా ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించి మైండ్ స్పోర్ట్స్  విద్యను అభ్యాసించాలని ఆమె కోరారు.

సెలవులు ముగిసిన అనంతరం విద్యార్థులు సమయానికి అనుకూలంగా పాఠశాలకు చేరుకోవాలని సూచించారు.విద్యార్థుల మార్కుల జాబితాను చూసి వారిని అభినందించారు. ప్రిన్సిపల్ ఎం మంజుల మాట్లాడుతూ విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు ఎండలో తిరగకుండా అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తలపై గుడ్డ వేసుకుని వెంట నిమ్మరసం నీటిని తీసుకొని జాగ్రత్తలు పడాలని టీజీపీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి లంక దాసరి భాస్కర్  కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ డి ధనలక్ష్మి, జెవిపి సృజన, ఉపాధ్యాయులు పద్మజ, పిఈటి అంజలి తదితరులు పాల్గొన్నారు.